: తస్మాత్ జాగ్రత్త... ప్లే స్టోర్ లో తిష్ట వేసిన వైరస్ నిండిన 'పోకేమాన్ గో' యాప్!

ప్రపంచ స్మార్ట్ ఫోన్లలో అతి స్వల్ప వ్యవధిలోనే అమిత ప్రాచుర్యం పొందిన 'పోకేమాన్ గో'కు సంబంధించిన వైరస్ నిండిన యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో తిష్టవేసిందని సాఫ్ట్ వేర్ సెక్యూరిటీ కంపెనీ ఈసెట్ పేర్కొంది. 'పోకేమాన్ గో అల్టిమేట్' పేరిట కనిపించే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే, గేమ్ రాదు సరికదా, 'పీఎల్ నెట్ వర్క్' పేరిట ఓ వైరస్ యాప్ ఇన్ స్టాల్ అయి, మొబైల్ లోని సమాచారాన్ని తస్కరిస్తుందని 'ది ఫోర్చ్యూన్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో స్మార్ట్ ఫోన్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోతుందని, పదేపదే రీస్టార్ట్ చేయాల్సి వస్తుందని, అది కూడా బ్యాటరీని తొలగించి రీస్టార్ట్ చేయాలని, ఆపై మాయమైనట్టు కనిపించే పీఎల్ నెట్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ లో ఉండి తప్పుడు యాడ్స్ సృష్టించి, వాటిని క్లిక్ చేసినట్టు చూపుతూ, మొబైల్ ఖాతాల్లోని డబ్బును లాగేస్తుందని, దీనిపట్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఈసెట్ వెల్లడించింది.

More Telugu News