: యూకేలో లింగమార్పిడి పిల్లలు ఇక 'జీ' కేటగిరీ!

పాఠశాలల్లో ప్రవేశం పొందే ట్రాన్స్ జెండర్ (లింగ మార్పిడి) పిల్లలను ఆంగ్ల అక్షరం 'జీ'తో గుర్తించాలని యూకే నిర్ణయించింది. మగపిల్లలైతే 'ఎం' అని, ఆడపిల్లలైతే 'ఎఫ్' అని గుర్తిస్తున్న యూకే బోర్డింగ్ స్కూల్స్ అసోసియేషన్, ఇకపై ట్రాన్స్ జెండర్ పిల్లల కోసం 'జీ' (జడ్ఐఈ)ని సూచించిందని బ్రిటన్ పత్రిక 'ది సండే టెలిగ్రాఫ్' పేర్కొంది. లింగమార్పిడి విద్యార్థులు తమను అతడు, ఆమెగా గుర్తించవద్దని చానాళ్లుగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, లింగ భేదం లేని సర్వనామంగా 'జీ'ని ఎంచుకున్నామని, బ్రిటన్ తో పాటు యూరప్ లోని టీచర్లంతా ఈ కొత్త పదాన్ని వాడుకోవచ్చని నూతన మార్గదర్శకాల రచయిత ఎల్లీ బార్న్ వెల్లడించారు.

More Telugu News