: ఇళ్ల లోంచి బయటకు రావద్దు: టర్కీలోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరిక

టర్కీలోని భారతీయులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అంకారాలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాల్లోకి ఇప్పుడప్పుడే రావద్దని సూచించింది. పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి చేరేంత వరకు ఇళ్లలోనే ఉండాలని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం అవసరమైతే అంకారాలో +905303142203 నంబరుకు, ఇస్తాంబుల్ లో +905305671095 కు ఫోన్ చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ ట్వీట్ చేశారు. దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదం, పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా టర్కీలో సైన్యం తిరగబడింది. గత రాత్రి దేశం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఈ సందర్భంగా అంకారాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 17 మంది పోలీసులు మృతి చెందారు. సైనిక తిరుగుబాటు నేపథ్యంలో దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. పరిస్థితి సద్దుమణిగే వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.

More Telugu News