: సంచలన తీర్పు... దక్షిణ చైనా సముద్రంలో చైనాకు హక్కు లేదన్న ఐరాస న్యాయస్థానం

ఐక్యరాజ్యసమితి న్యాయస్థానం చైనాకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చారిత్రకంగా ఎటువంటి హక్కులూ లేవని హేగ్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. చైనా సముద్రంలోని దీవులపై చైనా ఆధిపత్యాన్ని ఎండగట్టింది. "చైనా చెప్పుకుంటున్నట్టుగా చిన్న చిన్న దీవులపై ఆ దేశానికి ఎలాంటి చట్టపరమైన, చారిత్రకమైన హక్కులూ లేవు" అని శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో సముద్రంపై పట్టును ప్రదర్శిస్తూ, ఒక్కో దీవిని తన మిలటరీ శక్తితో ఆక్రమిస్తూ చైనా దూకుడును ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీవులపై హక్కులు తమవేనంటూ, తైవాన్, మలేషియా, మనీలా తదితర దేశాలు 2013లో ఐరాస ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా, విచారణ జరిపిన ట్రైబ్యునల్ తీర్పును వెలువరించింది.

More Telugu News