: అమెరికా డ్రోన్ దాడిలో పెషావర్ ‘ఉగ్ర’దాడి సూత్రధారి మన్సూర్ హతం

సుమారు రెండేళ్ల క్రితం పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై జరిగిన ‘ఉగ్ర’ దాడి సూత్రధారి, తెహ్రీక్-ఐ-తాలిబన్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉమర్ మన్సూర్ ను మట్టుబెట్టినట్లు పాకిస్థాన్ భద్రతా విభాగం అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ లోని నాన్ గర్ హార్ ప్రావిన్స్ లోని బందా ప్రాంతంలో మూడు రోజుల క్రితం అమెరికా చేసిన డ్రోన్ దాడిలో మన్సూర్ మరణించినట్లు తెలిపారు. ఈ దాడిలో మన్సూర్ తో పాటు మరో ఉగ్రవాద నేత ఖారి సైఫుల్లా కూడా మృతి చెందాడని అధికారులు పేర్కొన్నారు. కాగా, 2014 డిసెంబర్ 16న పాకిస్థాన్ లోని పెషావర్ లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 122 మంది విద్యార్థులు, 22 మంది ఉపాధ్యాయులు మృతి చెందారు. ఈ సంఘటనతో పాక్ ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేతకు చర్యలు ప్రారంభించింది. దీంతో, మన్సూర్ ఆఫ్ఘనిస్థాన్ కు పారిపోయాడు. ఆర్మీ పబ్లిక్ స్కూల్ పైనే కాకుండా 2016 జనవరిలో బచాఖాన్ యూనివర్శిటీపై జరిగిన ఉగ్ర దాడుల వెనుక కూడా మన్సూర్ హస్తం ఉందని సమాచారం.

More Telugu News