: ఖతార్ ఫండ్ తో రూ. 10 వేల కోట్లకు సహారా డీల్... కట్టాల్సిన డబ్బు కడతామని సుప్రీంకు తెలిపిన కపిల్ సిబల్

విదేశాల్లో సహారా గ్రూప్ కున్న మూడు విలువైన ఆస్తులను రూ. 10 వేల కోట్లకు ఖతార్ ఇన్వెస్ట్ మెంట్ అధారిటీకి విక్రయించేందుకు అనుమతి కోరుతూ, ఆ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుబ్రతా రాయ్ తరఫున కోర్టుకు హాజరైన కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్, తన వాదన వినిపిస్తూ, కోర్టు సూచించిన విధంగా ఆగస్టు 3 నాటికి రూ. 300 కోట్లను కోర్టుకు చెల్లిస్తామని తెలిపారు. లండన్ లోని గ్రాస్ వెనార్ హౌస్ హోటల్ విక్రయానికి సంబంధించి కసియోపియా హోల్డింగ్స్ ఓ డీల్ ను కుదిర్చే విషయమై ముందడుగు వేసిందని ఓ అఫిడవిట్ ను సిబల్ కోర్టుకు అందించారు. కాగా, రాయ్ మధ్యంతర బెయిలును పొడిగించాలంటే మరో రూ. 300 కోట్లను కోర్టుకు చెల్లించాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దావే, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే.

More Telugu News