: రూ. 1,225 కోట్లు సొంతానికి వాడుకున్న మాల్యా: స్వయంగా అంగీకరించిన యునైటెడ్ స్పిరిట్స్

యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన యునైటెడ్ స్పిరిట్స్ సంస్థను నిర్వహిస్తున్న వేళ, రూ. 1,225.30 కోట్లను సొంత అవసరాల నిమిత్తం దారి మళ్లించినట్టు సంస్థ ప్రకటించింది. ఆయన హయాంలో నిధుల దుర్వినియోగం అయిందని, ఆ లావాదేవీల్లో పారదర్శకత లేదని వెల్లడించింది. లిక్కర్ జెయింట్ డియాజియో, యూఎస్ఎల్ ను కొనుగోలు చేసిన తరువాత సంస్థ లావాదేవీలపై విచారణ జరపగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అరెస్టును తప్పించుకునేందుకు లండన్ లో తలదాచుకున్న మాల్యా, యూఎస్ఎల్ నుంచి పూర్తిగా తప్పుకునేందుకు డియాజియో నుంచి రూ. 500 కోట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. యూఎస్ఎల్ నుంచి ఆ నిధులను కింగ్ ఫిషర్ ఎయిర్, ఫార్ములా వన్ లకు తరలించాడని తెలుస్తోంది. ఈ లావాదేవీలు అక్టోబర్ 2010 నుంచి జూలై 2014 మధ్య జరిగినట్టు సమాచారం. తాజా ఆరోపణలపై విజయ్ మాల్యా ఇంకా స్పందించలేదు.

More Telugu News