: సుబ్రతో రాయ్ కి నిరవధిక బెయిల్ వచ్చేనా!... సుప్రీంకోర్టు వద్ద రూ.200 కోట్లు డిపాజిట్ చేసిన సహారా!

సామాన్య జనం నుంచి వేలాది కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించిన ‘సహారా ఇండియా పరివార్’ కేవలం 50 కోట్ల మేర మెచ్యూరిటీ తీరిన డిపాజిట్ల సొమ్మును చెల్లించలేకపోయింది. వెరసి ఆ సంస్థ చీఫ్ సుబ్రతో రాయ్ నెలల తరబడి జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన సుబ్రతో రాయ్ తన బెయిల్ గడువును నిరవధికంగా పొడిగించుకునేందుకు రంగంలోకి దిగారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న ఓ రూ.200 కోట్లను ఆయన తన సంస్థ తరఫున డిపాజిట్ చేయించారు. పనిలో పనిగా తన బెయిల్ ‘నిరవధికం’గా పొడిగించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. తనతో పాటు సహారా డైరెక్టర్ అశోక్ రాయ్ చౌదరి బెయిల్ ను కూడా నిరవధికంగా పొగించడంతో పాటు జైలులో ఉన్న మరో డైరెక్టర్ ఆర్ఎస్ దూబేకు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. మరి రాయ్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

More Telugu News