: మాంసాహారం తగ్గించండి...విద్యార్థులకు చైనా వివాదాస్పద ఆదేశం!

విద్యార్థి దశలోనే స్థూలకాయులుగా మారుతున్న చిన్నారుల సంఖ్యను తగ్గించాలన్న ఉద్దేశంతో చైనా ప్రభుత్వం మరో వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఒక్కొక్కరు రోజుకు 45 నుంచి 75 గ్రాముల మాంసాహారాన్ని మాత్రమే తీసుకోవాలని హుకుం జారీ చేసింది. విద్యార్థులు బరువు పెరిగితే ఉపాధ్యాయులనే బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. కాగా, ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం చైనాలో సగటున 150 గ్రాముల మాంసాహారాన్ని ప్రజలు తీసుకుంటున్నారు. దీన్ని తక్షణం సగానికి తగ్గించాలని, ముఖ్యంగా గోవులు, గొర్రెల మాంసాన్ని తినరాదని ప్రభుత్వం తరఫున ‘నేషనల్ సెంటర్ ఆన్ క్లైమెట్ చేంజ్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్’ డైరెక్టర్ జనరల్ లీ జున్‌ ఫెంగ్ ఆదేశించారు. ఈ ఉత్తర్వులు చైనా వాసుల్లో కోపాన్ని పెంచుతుంటే, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్, డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ లు వెనకేసుకొచ్చారు. చైనా మంచి నిర్ణయం తీసుకుందని వారు కొనియాడటం గమనార్హం.

More Telugu News