: ఉగ్రవాదుల నుంచి ఖురాన్ కాపాడుతుంది, స్కూళ్లలో దాన్ని తప్పనిసరి చేయాలి: రాంగోపాల్ వర్మ

వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్లతో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ఈరోజు మరో బాంబు పేల్చాడు. సినిమాలు, దేవుళ్లు, మతం అంశాల‌పైనే ఆయ‌న ఎక్కువ‌గా స్పందిస్తుంటాడు. తాజాగా అటువంటి అంశంపైనే మ‌రోసారి వివాదాస్ప‌ద ట్వీట్లు చేశాడు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఉగ్ర‌వాదులు ప‌ట్టుబ‌డ‌డం, బంగ్లాదేశ్ రాజ‌ధానిలో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయి ఇర‌వై మందిని బ‌లిగొన్న విష‌యం, ప‌లు దేశాల్లో ఉగ్ర‌వాదులు మార‌ణ‌హోమం సృష్టిస్తుండ‌డం వంటి ఉగ్ర‌వాద చ‌ర్య‌లు వ‌ర్మను క‌దిలించాయేమో..! ఈ సారి వ‌ర్మ ఉగ్ర‌వాదుల నుంచి ఇలా త‌ప్పించుకోండంటూ ఓ స‌ల‌హా ప‌డేశాడు. ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడానికి హిందువులు, క్రిస్టియ‌న్‌లు కూడా ఖురాన్‌ను నేర్చుకోవాల‌ని ఆయ‌న ఈరోజు ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. ఒకవేళ‌ వారిని వారి సొంత‌ మతం కాపాడలేకపోతే ఖురాన్ కాపాడుతుంది అని వ‌ర్మ ట్వీట్ చేశాడు. ‘ఢాకాలో ఉగ్ర‌వాదులు తెగ‌బ‌డిన త‌రువాత స్కూళ్ల‌లో ఖురాన్‌ను తప్ప‌నిస‌రి చేయ‌డ‌మే వారినుంచి త‌ప్పించుకునేందుకు ప‌రిష్కారంగా క‌నిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నాడు.

More Telugu News