: గ్రహాంతర వాసుల జాడపై పరిశోధనల్లో కీలకమైన అడుగేసిన చైనా

గ్రహాంతరవాసుల జాడపై ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనల్లో చైనా కీలక అడుగువేసింది. సుమారు 30 ఫుట్ బాల్ మైదానాల పరిమాణంలో నిర్మించిన భారీ టెలిస్కోపును చైనా నేడు ఆవిష్కరించింది. ఈ టెలిస్కోప్ తో గ్రహాంతర వాసుల జాడపై మానవుని అన్వేషణ సరికొత్త మలుపులు తిరగనుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నైరుతి చైనాలోని గుయ్జోయూ ప్రావిన్సులో గల కార్ట్స్ వ్యాలీలో సుమారు 4,450 ప్యానల్స్ ను ఉపయోగించి, 180 మిలియన్ డాలర్ల వ్యయంతో, 300 మందికిపైగా బిల్డర్లు, శాస్త్రవేత్తలు ఈ భారీ టెలిస్కోప్ ను తయారు చేశారు. దీనిని నేటి ఉదయం 10:47 నిమిషాలకు వాడకంలోకి తెచ్చారు. రానున్న రెండు మూడేళ్ల కాలంలో దీని ద్వారా జరిపే పరిశోధనలను టెస్టింగ్ పీరియడ్ అంటారని వారు తెలిపారు. ఈ టెలిస్కోప్ ద్వారా సేకరించే సమాచారాన్ని త్వరలోనే విశ్లేషించే పనులు ప్రారంభిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనితో ఏలియన్స్ జాడపై ఉన్న అనుమానాలు తొలగిపోతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News