: భూమి ఉపరితలం నుంచి భూ కేంద్రానికి విమానంలో వెళ్లాలంటే 1.8 ఏళ్లు పడుతుందట!

మనం నివసిస్తున్న భూగోళం కేంద్రం దగ్గరకు మనిషి వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది? అనే దానికి సమాధానాన్ని అమెరికాలోని పెన్సుల్వేనియాలోని కింగ్స్ కాలేజ్ కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ధామస్ కాంకనన్, గెరార్డో గియోర్డనోలు కనుగొన్నారు. భూమి ఉపరితలం నుంచి భూ కేంద్రానికి ఒక సొరంగ మార్గం ఉందనుకుంటే...అందులోంచి ఓ విమానంలో భూ కేంద్రానికి చేరుకోవాలంటే 1.8 ఏళ్లు పడుతుందని లెక్కకట్టారు. ఇంత సుదీర్ఘకాలం పట్టేందుకు కారణమేంటంటే...భూ ఉపరితలం నుంచి భూ కేంద్రానికి వెళ్తున్న కొద్దీ భూమ్యాకర్షణశక్తి పెరుగుతుంది. అదే సమయంలో సొరంగ మార్గం గోడల నుంచి ఏర్పడే ఒత్తిడి, అలాగే గ్యాస్ (వాయు) రూపంలో ఎదురయ్యే ఒత్తిడి లోపలికి వెళ్లే కొద్దీ ఘనపదార్థ ఒత్తిడిలా మారుతుందని వారు చెప్పారు. దీని కారణంగానే భూ కేంద్రానికి చేరుకోవాలంటే అక్కడికి 1.8 ఏళ్లు పడుతుందని వారు తెలిపారు. ఈ టన్నెల్ (సొరంగం) లో ఎలాంటి ఒత్తిడి, భూమ్యాకర్షణ శక్తి లేదని భావిస్తే అదే విమానంలో కేవలం 42 నిమిషాల్లో భూ కేంద్రానికి చేరుకోవచ్చని వారు చెప్పారు. అయితే, ఏదైనా వాహనం ద్వారా భూ కేంద్రం వద్దకు ప్రస్తుతం కానీ, సమీప భవిష్యత్ లో కానీ చేరుకోలేమని వారు ముక్తాయించారు.

More Telugu News