: సెంటిమెంటును పెంచిన వర్షాలు... ఆరంభంలోనే ఎగిరి దుమికిన మార్కెట్ బుల్

దలాల్ స్ట్రీట్ లో కొత్తకళ కనపడుతోంది. దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఇనుమడించిన వేళ, గత వారాంతపు భారీ లాభాలు కొనసాగాయి. నేటి సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా పెరిగింది. క్యాబినెట్ రీషపుల్ వార్తలతో పాటు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పెరగడం కూడా నూతన పెట్టుబడులకు కారణమైందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ రిటైల్ ఇన్వెస్టర్లు, ఫండ్ సంస్థలు నూతన కొనుగోళ్లకు దిగుతున్నాయి. ఉదయం 11:30 గంటల సమయంలో సెన్సెక్స్ సూచిక 200 పాయింట్లు పెరిగి 27,345 పాయింట్ల వద్ద, నిఫ్టీ సూచిక 60 పాయింట్ల వృద్ధితో 8,390 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో 38 కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా, రూ. 2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో అతిపెద్ద రిఫైనరీ రానుందన్న వార్తలతో ఓఎన్జీసీ అత్యధికంగా 3.42 శాతం లాభపడింది. టాటా సంస్థలు బ్యాంకులు లాభాలను పండించుకుంటున్నాయి. డాలర్ విలువ రూ. 67.44గా ఉండగా, బ్రిటన్ పౌండు విలువ మరింతగా పడిపోయి 89.54 వద్ద కొనసాగుతోంది.

More Telugu News