: చైనాలో లభించిన గౌతమ బుద్ధుడి పుర్రె ఎముక!

దాదాపు వెయ్యి సంవత్సరాలకు ముందు నుంచే ఉన్న ఓ బౌద్ధాలయంలో తవ్వకాలు జరుపుతున్న పురాతత్వవేత్తలకు గౌతమ బుద్ధుడి అవశేషాలు లభించినట్టు తెలుస్తోంది. నానజింగ్ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా, నాలుగు అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగుల వెడల్పులో ఉన్న బంగారు పెట్టె లభించింది. దీనిలో ఓ పుర్రె ఎముక ఉంది. దీనిపై తామర పువ్వులు, దేవతల విగ్రహాలను నగిషీగా చెక్కి ఉన్నారు. ఓ ప్రత్యేక లిపిలో కొన్ని అక్షరాలు కూడా ఉన్నాయి. దీన్ని ఇంత పవిత్రంగా భద్రంగా దాచడానికి కారణం ఇది బుద్ధుడి అవశేషాలు కావడమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More Telugu News