: నల్ల ధనం మూటల విషయంలో భారత్ ను వెనక్కు నెట్టేసిన పాక్!

అక్రమంగా కూడబెట్టిన ధనాన్ని భద్రంగా దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు స్వర్గధామంగా మారాయి. వేలాది మంది భారతీయులు లక్షలాది కోట్ల రూపాయలను ఈ బ్యాంకుల్లో దాచుకున్నారని గడచిన ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా ప్రచారం చేసింది. తమ చేతికి అధికారం చిక్కితే సదరు సొమ్మును నెల రోజుల్లో వెనక్కు తీసుకొస్తామని చెప్పింది. నెల రోజుల్లో కాదు కదా.. రెండేళ్లు గడిచినా బీజేపీ సర్కారు ఆ సొమ్మును తేలేకపోయింది. అయితే అక్కడి నల్ల ధనం మూటలను తగ్గించడంలో మాత్రం మోదీ సర్కారు సఫలీకృతమైంది. అంతేకాదండోయ్... ఇకపై అక్కడ డబ్బు దాచుకునేందుకు భారతీయులు సాహసించడం లేదు. వెరసి స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నల్ల ధనం మూటలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఆ బ్యాంకుల్లో భారతీయులకు చెందిన సొమ్ము కేవలం రూ.8 వేల కోట్ల లోపేనని సమాచారం. ఇక అన్ని అంశాల్లో భారత్ తో పోటీకి దిగుతున్న పాకిస్థాన్... నల్ల ధనం విషయంలోనూ అదే వైఖరిని కొనసాగిస్తోంది. ఓ వైపు స్విస్ బ్యాంకుల్లో భారతీయుల అక్రమ సొమ్ము తగ్గిపోతుంటే... పాక్ జాతీయులకు చెందిన నల్ల ధనం మూటల సంఖ్య క్రమంగా పెరిగిపోతోందట. 2014తో పోలిస్తే స్విస్ బ్యాంకుల్లో పాక్ నల్ల ధనం గతేడాది 16 శాతం మేర పెరిగింది.

More Telugu News