: స్విస్ బ్యాంకుల్లో రికార్డు స్థాయిలో తగ్గిన భారతీయుల నల్లధనం!

స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం మొత్తం గణనీయంగా తగ్గింది. స్విస్ లో బ్యాంకు ఖాతాలపై నిఘా పెరగడం, ఇండియాలో పెరిగిన స్క్రూటినీ తదితర కారణాలతో స్విస్ బ్యాంకు ఖాతాల్లో భారతీయుల డబ్బు మూడింట ఒక వంతు పడిపోయింది. డిసెంబర్ 2015 నాటికి 1.2 స్విస్ బిలియన్ ఫ్రాంక్స్ (సుమారు రూ. 8,392 కోట్లు) డబ్బు బ్యాంకుల్లో ఉంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 596 స్విస్ బిలియన్ ఫ్రాంకులు తక్కువని స్విస్ నేషనల్ బ్యాంకు వెల్లడించింది. 1997లో తమ బ్యాంకుల్లోని ఖాతాదారుల వివరాలు బహిర్గతం చేయడం ప్రారంభించిన తరువాత, భారతీయుల ఖాతాల్లో వరుసగా రెండు సంవత్సరాల్లో డబ్బు తగ్గడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి 2006 నుంచి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నగదు తగ్గడం ప్రారంభించింది. ఆ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.5 స్విస్ బిలియన్ ఫ్రాంకుల డబ్బు (సుమారు రూ. 23 వేల కోట్లు) ఖాతాల్లో ఉంది. ఆపై నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. మధ్యలో 2011లో ఓసారి, 2013లో ఓసారి నల్లధనం మొత్తం పెరిగింది. ఇక మోదీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత తీసుకుంటున్న చర్యలతో మరింత వేగంగా నల్లధనం తగ్గుతుండటం గమనార్హం.

More Telugu News