: 1,109 క్యారెట్ల ప్రపంచపు అత్యంత విలువైన వజ్రం... అమ్ముతామంటే కొనేవారేరి?

ప్రపంచంలోనే అత్యంత విలువైన ముడి వజ్రంగా పేరు తెచ్చుకున్న 'లేసిడీ లా రోనా జమ్'ను విక్రయానికి ఉంచగా, దాన్ని సొంతం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. లండన్ లో సౌత్ బే ఆక్షన్ సంస్థ ద్వారా లుకారా డైమండ్ కార్పొరేషన్, ఈ 1,109 క్యారెట్ల వజ్రాన్ని అమ్మకానికి ఉంచింది. దీని రిజర్వ్ ధర 70 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 470 కోట్లు) కాగా, ఆ ధర కన్నా ఎవరూ అధికంగా వెచ్చించేందుకు ముందుకు రాలేదు. దీంతో వజ్రం వేలాన్ని నిలిపివేసినట్టు సౌత్ బే ప్రకటించింది. ఈ వజ్రానికి అత్యధికంగా 61 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 410 కోట్లు) ధరను ఓ వ్యక్తి ఆఫర్ చేశారని తెలుస్తోంది. వజ్రం వేలాన్ని ఆపామని, ఇంతకన్నా మరిన్ని వివరాలు వెల్లడించలేమని లుకారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విలియమ్ లాంబ్ వెల్లడించారు. తాము మరింత మంచి ధర వస్తుందని భావించామని, ఆ ధర రాకపోవడంతో నిరుత్సాహంతో ఉన్నామని తెలిపారు. దీని విలువను మరోసారి తెలిపి, కొద్ది రోజుల తరువాత ఇంకోసారి వేలం తేదీని ప్రకటిస్తామని అన్నారు.

More Telugu News