: 24 మంది యువతుల నుంచి 24 పాఠాలు నేర్చుకున్నానంటూ పేర్లతో సహా చెప్పిన షారూఖ్!

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్... ఇండస్ట్రీలోకి ప్రవేశించి 24 సంవత్సరాలు అయిన సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో ఏం పంచుకున్నారో తెలుసా? తన జీవితంలో 24 మంది యువతుల నుంచి 24 పాఠాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. వారందరి పేర్లనూ చెబుతూ, ఆ పేర్ల అబ్రివేషన్స్ తెలుపుతూ, ఆ పాఠాలను తన జీవితంలో భాగంగా చేసుకున్నానని వెల్లడించాడు. తన తొలి సినిమా 'దీవానా' నుంచి తాజా చిత్రం 'ఫ్యాన్' వరకూ అభిమానులను అలరిస్తూ సాగుతున్న ఆయన చెప్పిన 24 మంది మహిళల పేర్లు, వారి నుంచి నేర్చుకున్న పాఠాలు ఇవే. 1. TINA: There is nothing abnormal. (అసాధారణమైనది ఏదీ లేదు) 2. GENA: Give everyone, not accumulate. (ప్రతి ఒక్కరికీ ఇవ్వండి, పోగేసుకోవద్దు) 3. FAGUN: Fall and get up nonetheless. (పడిపోయినా లేవాలి) 4. MINA: mediocrity is not acceptable. (మామూలుగా ఉంటే చెల్లదు) 5. DHUN: Don’t have unnecessary negativity. (అకారణంగా వ్యతిరేకత చూపవద్దు) 6. RHEA: Respect ‘HER’ everywhere always. (మహిళను ఎప్పుడూ గౌరవించాలి) 7. DIPA: Director is pilot always. (ఎప్పటికీ దర్శకుడే ముందుండి నడిపించేవాడు) 8. CHITRA: Compete hard, in true rightful ardor. (నిజమైన ఉత్సాహంతో పోటీ పడాలి) 9. EASHA: Eventually all sadness heals accordingly. (బాధలన్నీ వస్తుంటాయి, పోతుంటాయి) 10. CAROL: Children are raised On Love. (చిన్నారులపై ప్రేమ చూపితేనే ఎదుగుతారు) 11. ITI: Imagine the impossible. (అసాధ్యాన్ని ఊహించగలగాలి) 12. TYRA: Take your Risks audaciously. (రిస్క్ లను తెగువతో తీసుకోవాలి) 13. SKY: Smoking kills you. (పొగతాగడం మరణానికి దగ్గర చేస్తుంది) 14. LYRA: Laugh your regrets away. (నవ్వితే కష్టాలు దూరమవుతాయి) 15. TIA: Take India ahead. (భారతావనిని ముందుకు తీసుకెళ్లాలి) 16. SWATI: Superheroes wear acutely tight innerwear. (సూపర్ హీరోలు బిగుతుగా ఉండే లోదుస్తులు ధరిస్తారు) 17. FIDA: Family is dependable always. (కుటుంబాన్ని ఎప్పుడూ సంరక్షిస్తుండాలి) 18. AMNA: Art matters, not artist. (కళే ముఖ్యం, కళాకారుడు కాదు) 19. ANITA: Assume not imbeciles take advice. (సలహాలు ఇచ్చే వారందరినీ వెధవల్లా భావించవద్దు) 20. MIRA: Mommy is right always. (అమ్మ చెప్పేది ఎప్పుడూ సరైనదే) 21. Akira: A King inspires righteous aims. (సరైన లక్ష్యంతో వెళ్లే రాజు స్ఫూర్తినిస్తాడు) 22.ASMA: Always smell ‘manlike’ agreeable. (ఎన్నడూ మానవత్వాన్ని మరువరాదు) 23. NAINA: Nature always instills naked awesomeness. (ప్రకృతి నిత్యమూ ఆశ్చర్యాలను చూపుతూనే ఉంటుంది) 24. LAILA: Life abounds in loving all. (అందరికీ పంచడంతోనే ప్రేమ పెరుగుతుంది)

More Telugu News