: 30 రోజుల్లో వెళ్లిపోవాలని మార్జాలానికి నోటీసులిచ్చిన అమెరికా అధికారులు!

ఇంట్లో ఇబ్బందులు పెడుతున్న టెనెంట్స్ ను ఖాళీ చేయడానికి నోటీసులు పంపుతామన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, అమెరికన్ అధికారులు ఓ మార్జాలానికి నోటీసులిచ్చారు. ఈ వింత ఘటన టెక్సాస్ లైబ్రరీలో జరిగింది. ఈ లైబ్రరీలో బ్రౌజర్ అనే పిల్లి గత ఆరేళ్లుగా ఉంటోంది. దీన్ని ఓ జంతు సంరక్షణ కేంద్రం నుంచి దత్తత తీసుకోగా, లైబ్రరీకి వచ్చే వాళ్లందరికీ ఇది సుపరిచితమే. అయితే, దీని చర్యల వల్ల తమ ఏకాంతానికి భంగం వాటిల్లుతోందని, ఇది తమను చదువుకోనీయకుండా డిస్టర్బ్ చేస్తోందని పలువురు ఫిర్యాదు చేయడంతో, బ్రౌజర్ పై లైబ్రరీ నిర్వాహకులు రెఫరెండం పెట్టారు. అత్యధికులు దీన్ని బయటకు పంపేందుకే నిర్ణయించడంతో, నిబంధనల మేరకు 30 రోజుల నోటీసును ఇచ్చారు. కొందరు దీన్ని బయటకు పంపేందుకు ససేమిరా అంటూ, నిరసనలు చెబుతున్నా, మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారమే బ్రౌజర్ ను పంపించేస్తామని లైబ్రరీ కౌన్సిల్ చెబుతోంది.

More Telugu News