: తేడా వచ్చింది... స్వాతంత్ర్యం కావాలని నినదిస్తున్న స్కాట్ ల్యాండ్!

యూకేలో భాగంగా ఉన్న స్కాట్ ల్యాండ్ స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటోంది. రెండు రోజుల క్రితం ఈయూలో ఉండాలా? వద్దా? అన్న విషయమై రెఫరెండం జరుగగా, స్కాట్ ల్యాండ్ యావత్తూ, ఉండాలని కోరుకున్న సంగతి తెలిసిందే. రెఫరెండంలో బ్రిటన్ కూటమి నుంచి విడిపోవాలని తీర్పిచ్చిన నేపథ్యంలో, మాట తేడా వచ్చింది కాబట్టి, యూకేతో కలిసుండటం ఇక అనవసరమని స్కాట్ ల్యాండ్ ప్రజలు భావిస్తున్నారు. తమ ప్రభుత్వం యూకేతో కలిసుండాలా? విడిపోవాలా? అన్న అంశంపై రెఫరెండం నిర్వహించనుందని స్కాటిస్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టుర్జియాన్ వ్యాఖ్యానించారు. ఎడిన్ బర్గ్ లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, పరిస్థితిని చర్చించిన ఆమె, తదుపరి మీడియాతో మాట్లాడుతూ, రెండో రెఫరెండం నిర్వహించడమే తమ ముందున్న మార్గమని తెలిపారు. స్కాట్ ల్యాండ్ భవిష్యత్ కోసం ప్రజల అభిప్రాయాన్ని అడగనున్నామని తెలిపారు. కాగా, రెండు సంవత్సరాల క్రితం బ్రిటన్ తో కలిసుండే విషయంలో స్కాట్ ల్యాండ్ లో రెఫరెండ్ం జరుగగా, అత్యధికులు కలిసుంటేనే మేలని ఓటేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓటింగ్ జరిగితే, విడిపోయేందుకే స్కాట్లాండ్ వాసులు మొగ్గు చూపుతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News