: బ్రిటన్ లో రెఫరెండం ప్రభావం... యూఎస్ లో ట్రంప్ గెలుస్తాడంటున్న నిపుణులు!

యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ వాసులు చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన వేళ, ఫలితాన్ని విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు, అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు అనుకూల ఫలితాలు వెలువడతాయని వ్యాఖ్యానిస్తున్నారు. బ్రిటన్, అమెరికాలకు ఉన్న దగ్గరి పోలికలను చూపుతూ, పేద, ఉన్నత వర్గాల ప్రజల మధ్య స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుగు ప్రజలకు అందడం లేదని, పైగా వలస వాదుల నుంచి వస్తున్న సమస్యలు ప్రజలను ప్రభుత్వ ఆలోచనలకు దూరం చేశాయని విశ్లేషించారు. అందువల్లే కూటమి నుంచి విడిపోవాలని అత్యధికులు ఓటు వేశారని, ఇదే పరిస్థితి అమెరికాలోనూ ఉన్న కారణంగా ట్రంప్ గెలుస్తాడని అభిప్రాయపడ్డారు.

More Telugu News