: బీసీసీఐ నిర్ణయం నన్ను నిరాశపరిచింది... కుంబ్లేకు అంతా మంచే జరగాలి: రవిశాస్త్రి

టీమిండియా ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లేను నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తనను నిరాశపరిచిందని మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అన్నారు. ఈ పదవి తనకు దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీమిండియా డైరెక్టర్ గా 18 నెలల పాటు పనిచేసి మెరుగైన ఫలితాలు రాబట్టగలిగానని అన్నారు. దీంతో పాటు, భారతజట్టును నిశితంగా పరిశీలించానని, కోచ్ గా తనను నియమించినట్లయితే ఆ అనుభవం ఉపయోగపడుండేదన్నారు. ఏమైనా, ప్రధాన కోచ్ గా నియమితుడైన కుంబ్లేకు అంతా మంచే జరగాలని తాను కోరుకుంటున్నానని ఈ సందర్భంగా రవిశాస్త్రి అన్నారు.

More Telugu News