: మొదట కోచ్ గా కుంబ్లేను అనుకోలేదు: అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్య

అనిల్ కుంబ్లే... భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన దిగ్గజ ఆటగాడిగా ఇప్పుడు క్రికెట్ జట్టుకు కోచ్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న వ్యక్తి. అయితే, జట్టుకు కోచ్ గా తొలుత అనిల్ కుంబ్లేను అనుకోలేదని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్వయంగా వెల్లడించి కొంత సంచలనం కలిగించారు. తాము మొదట రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా నియమించాలని భావించామని తెలిపారు. "భారత టీమ్ కు కోచ్ గా ఉండాలని నేను రాహుల్ ద్రావిడ్ ను కోరాను. ఆయన కాదనలేదు. అయితే, జూనియర్ టీమ్ కోసం పనిచేస్తానని చెప్పాడు" అని ఠాకూర్ వెల్లడించారు. రాహుల్ ద్రావిడ్ మంచి గుణం అదేనని, సీనియర్ టీమ్ కు కోచ్ గా ఉండి, అధిక డబ్బు పేరు తెచ్చుకోవాలని భావించకుండా, చిన్నారులను మెరుగైన క్రికెటర్లుగా తీర్చి దిద్దాలని ఆయన భావించాడని తెలిపారు. కాగా, బీసీసీఐ సలహా సంఘంలో గంగూలీ, లక్ష్మణ్, సచిన్ లతో పాటు కొనసాగాలని రాహుల్ ను కోరినా ఆయన అంగీకరించలేదన్న విషయం తెలిసిందే.

More Telugu News