: సినిమాల్లోకి రాకుంటే, జైల్లో కాలం గడుపుతూ ఉండేవాడిని: తనికెళ్ల భరణి

తన బాల్యమంతా పశ్చిమ గోదావరి జిల్లా శంఖంపేట రైల్వే క్వార్టర్స్ లో గడిచిందని, స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడమే నిత్య కృత్యమని, దీనికి తోడు హత్యలు, దొంగతనాలు చేస్తున్న వారితో స్నేహంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్న నటుడు, రచయిత తనికెళ్ల భరణి, తాను సినిమాల్లోకి రాకపోయివుంటే, ఏదో ఓ నేరం చేసి ఖమ్మం జైల్లో గడుపుతూ ఉండేవాడినని అన్నారు. ఖమ్మంలోని జూబ్లీ క్లబ్ లో జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తనికెళ్ల పలు ఆసక్తికర కబుర్లు చెప్పారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టమని, సినిమాల్లోకి రాకపూర్వం 28 సంవత్సరాల పాటు నాటకాలు వేశానని గుర్తు చేసుకున్నారు. చిన్నపిల్లలతో పాటు, కవులుగా రాణించాలని భావించే వారు రామాయణ, మహాభారతాల్లాంటి ఇతిహాసాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలని సలహా ఇచ్చారు. సినీనటుడు రాళ్లపల్లితో ఏర్పడిన పరిచయం తన జీవితాన్ని మార్చిందని, ఆయనే నాటకాల్లో అవకాశాలు ఇప్పించారని, ఆపై 700కు పైగా చిత్రాల్లో నటించానని తెలిపారు.

More Telugu News