: ఖురాన్ చదివితే ఉచితంగా పెట్రోల్ ఇస్తున్న ఇండోనేషియా చమురు సంస్థ!

ప్రజల్లో మత విశ్వాసాలను మరింతగా పెంచాలన్న ఉద్దేశంతో ఇండోనేషియాలో ప్రభుత్వ చమురు సంస్థ 'పెట్టామిన' వినూత్న నిర్ణయం తీసుకుంది. ఖురాన్ లోని ఓ చాప్టర్ చదివితే రెండు లీటర్ల పెట్రోల్ ను ఉచితంగా ఇస్తామని వెల్లడించింది. ఖురాన్ చదువుకునేందుకు పెట్రోలు బంకుల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. అక్కడికి వెళ్లే బైకర్లు, కారు యజమానులు, ఆ గదిలోకి వెళ్లి, ఖురాన్ పుస్తకం తీసుకుని ఓ చాపర్టర్ చదివితే, బయట ఉచితంగా పెట్రోల్ అందుతుంది. ఖురాన్ చదివిన పుణ్యంతో పాటు ఉచితంగా పెట్రోల్ కూడా లభిస్తుండటం పట్ల ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఖురాన్ - పెట్రోల్ స్కీము ఎన్ని రోజులు సాగుతుందన్న విషయాన్ని మాత్రం సదరు సంస్థ వెల్లడించలేదు.

More Telugu News