: ఫినిషింగ్ ఇవ్వలేకపోయిన ధోనీ... టీమిండియా ఓటమి... జింబాబ్వే ఘన విజయం

జింబాబ్వే సత్తాచాటింది. వన్డేలకు పూర్తి భిన్నమైన ఆటతీరుతో అద్భుతంగా ఆకట్టుకుంది. హరారేలో జరిగిన తొలి టీ20లో భారత్ ను రెండు పరుగుల తేడాతో ఓడించి షాక్ ఇచ్చింది. ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్ అన్న పేరుతెచ్చుకున్న ధోనీ క్రీజులో ఉన్నప్పటికీ టీమిండియా ఓటమిపాలవ్వడం విశేషం. మసకద్జ (25), చిబాబా (20) ఆకట్టుకున్నారు. అనంతరం సికిందర్ రజా (20), వాలర్ (30), చిగుంబర (54) రాణించడంతో 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు పరుగులేమీ చేయకుండానే ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) వికెట్ కోల్పోయింది. స్కోరు బోర్డు మీద పరుగలేమీ లేకుండా అవుటవ్వడం భారత టీ20 చరిత్రలో ఇదే తొలిసారి. అనంతరం మన్ దీప్ సింగ్ (31), రాయుడు (19) ఆదుకునే ప్రయత్నం చేసినా కీలక సమయంలో రాయుడు కూడా అవుటయ్యాడు. అనంతరం మనీష్ పాండే (48) రాణించి విజయం దిశగా తీసుకెళ్తున్న సమయంలో తనూ అవుటయ్యాడు. జాదవ్ (19) ఫర్వాలేదనిపించి నిష్క్రమించాడు. విజయానికి 28 పరుగులు అవసరమైన దశలో బ్యాటింగ్ కు దిగిన అక్షర్ పటేల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ (19)తో మెరుపులు మెరిపించినా 20వ ఓవర్ రెండో బంతికి అవుటయ్యాడు. టీమిండియా 90 పరుగుల స్కోరు వద్ద ఉండగా క్రీజులోకి వచ్చిన ధోనీ (19), చివరివరకు క్రీజులో ఉన్నప్పటికీ విన్నింగ్ షాట్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు మాత్రమే చేయగలిగి, ఓటమిపాలైంది. దీంతో తొలి టీ20 మ్యాచ్ లో విజయం సాధించి ఆకట్టుకుంది.

More Telugu News