: హెచ్డీఎఫ్సీ లైఫ్ లో మాక్స్ లైఫ్ విలీనం

భారత బీమా రంగ చరిత్రలో మరో పెద్ద విలీనానికి రంగం సిద్ధమైంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ లో విలీనం అయ్యేందుకు మాక్స్ లైఫ్ సన్నద్ధమైంది. ఈ విలీనానికి మాక్స్ లైఫ్, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలపడంతో ఇక విలీనం లాంఛనమే. విలీనం సంగతిని మూడు సంస్థలూ నేడు స్టాక్ మార్కెట్ కు తెలియజేశాయి. ఈ మేరకు రద్దు చేసుకునేందుకు వీలులేని ఒప్పందం తమ మధ్య కుదిరిందని తెలిపాయి. అయితే, వాటాల నిష్పత్తి, పంపకం, కొత్త సంస్థలో మాక్స్ అధికారుల బాధ్యతలు వంటి విషయాలపై ఏ సంస్థ కూడా వివరాలు అందించలేదు. ఈ సంస్థల వద్ద మిగులు నిధులు, ప్రీమియం అధికమొత్తంలో ఉన్నందున భవిష్యత్తులో మరింత మెరుగైన బీమా సేవలు ప్రజలకు అందనున్నాయని పారీఖ్ అడ్వియిజరీ సర్వీసెస్ మేనేజింగ్ పార్టనర్ అశ్విన్ పారీఖ్ అభిప్రాయపడ్డారు. కాగా, హెచ్డీఎఫ్సీ లైఫ్ భారత బీమా రంగంలో సేవలందిస్తున్న అతిపెద్ద సంస్థగా ఉంది. మార్చి 31 నాటికి ఈ సంస్థ రూ. 6,487.66 కోట్ల ప్రీమియంను వసూలు చేసింది. మాక్స్ లైఫ్ టాప్-5 బీమా కంపెనీల్లో ఒకటిగా ఉండి రూ. 2,881 కోట్ల ప్రీమియంను వసూలు చేసింది.

More Telugu News