: ఒక్కసారిగా రూ. 600 పెరిగి రూ. 31,500 దాటిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1,300 డాలర్లను దాటవచ్చని వచ్చిన అంచనాలతో భారత మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ధరలు హైజంప్ చేశాయి. ఆగస్టులో డెలివరీ అయ్యే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర విలువ ఏకంగా రూ. 615 పెరిగింది. క్రితం ముగింపుతో పోలిస్తే 2.02 శాతం పెరిగి రూ. 31,509కి చేరింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న నిపుణుల అంచనాలు బంగారం కొనుగోలుకు మద్దతును తెచ్చాయని అనలిస్టులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో షార్ట్ కవరింగ్ సైతం ఎంసీఎక్స్ లో కనిపించింది. కాగా, నేటి సెషన్లో వెండి ధర కిలోకు (జూలై 5 కాంట్రాక్టు) రూ. 713 పెరిగి రూ. 42,260కి చేరింది.

More Telugu News