: ఇద్దరు మగాళ్ల ‘లిప్ లాక్’ మతీన్ కు నచ్చలేదు... ఓర్లాండో నరమేధానికి కారణమిదేనా?

అమెరికాను తన దుశ్చర్యతో వణికించిన ఒమర్ మతీన్... అసలు ఆ దుశ్చర్యకు పాల్పడిన కారణం వింటే ఆశ్చర్యం వేయక మానదు. ఇద్దరు మగాళ్లు బహిరంగంగా ముద్దు పెట్టుకున్న ఓ ఘటన, స్వలింగ సంపర్కంపై తీవ్ర వ్యతిరేక భావనలున్న మతీన్ ను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసిందట. ఈ క్రమంలోనే అతడు ఫ్లోరిడాలోని ఓర్లాండో ‘గే’ క్లబ్ లక్ష్యంగా నరమేధం సృష్టించాడు. ఈ మేరకు మతీన్ తండ్రి మిర్ సిద్ధిఖ్ దాడి తర్వాత స్పందించిన సందర్భంగా ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవలే మియామీ బీచ్ కు వెళ్లిన సందర్భంగా ఇద్దరు మగాళ్లు బహిరంగంగా ముద్దుపెట్టుకుంటున్న వైనం చూసి మతీన్ ఆగ్రహానికి గురయ్యాడని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో గే క్లబ్ పై మతీన్ దాడి చేసి ఉంటాడని కూడా సిద్ధిఖ్ తెలిపారు. తన కొడుకు చేసిన ఈ దాడిని ఖండించిన సిద్ధిఖ్... ఘటనను మతపరమైన అంశంగా పరిగణించవద్దని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం.

More Telugu News