: అతిపెద్ద, అత్యుత్తమ దుర్వినియోగి చైనా: విరుచుకుపడ్డ ట్రంప్

అమెరికన్ ఔత్సాహికులు, శాస్త్రవేత్తల మేధోసంపత్తిని కాపీ కొట్టి తయారు చేసిన ఉత్పత్తులను యూఎస్ లో రాసులుగా పోసి వ్యాపారం చేస్తున్న చైనా, ఆ దేశంలో వ్యాపారానికి వెళుతున్న అమెరికన్ కంపెనీలపై భారీ పన్నులను విధిస్తోందని రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడనున్న డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. "ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యుత్తమ దుర్వినియోగి చైనా. చైనాకు చిన్న వర్షన్ మెక్సికో. స్వేచ్ఛా వాణిజ్యం ఉండాలి. కానీ అది పారదర్శకంగా ఉండాలి. మంచి డీల్స్ జరగాలి. అవి రెండు దేశాలకూ మేలు కలిగించాలి" అని ఆయన అన్నారు. పిట్స్ బర్గ్ లో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. చైనా తన దేశంలోని తుక్కు ఇనుమును అమెరికాలోకి కుమ్మరిస్తూ, ఇక్కడి మేధస్సును దొంగిలిస్తోందని ట్రంప్ ఆరోపించారు. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు సరైన ట్రిగ్గర్ నొక్కితే, ఆపై ఎలాంటి తమాషా జరుగుతుందో చూస్తారని అన్నారు.

More Telugu News