: కరణ్ నాయర్ అవుట్...క్రీజులో రాహుల్, రాయుడు

జింబాబ్వే టూర్లో తొలి మ్యాచ్ లో టీమిండియా విజయం లాంఛనమే. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు రిజర్వ్ బెంచ్ ను పటిష్ఠం చేసుకునే దిశగా భారత్ 'ఏ' టీంలోని ఆటగాళ్లకు అవకాశాలు కల్పించి జింబాబ్వేకు పంపిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో బౌలింగ్ ఎంచుకున్న టైటిల్ ఫేవరేట్ భారత జట్టు ఊహించినట్టే 168 పరుగులకు కట్టడి చేసింది. 169 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆదిలోనే కరణ్ నాయర్ (7) వికెట్ ను కోల్పోయింది. కట్టుదిట్టమైన బంతులతో జింబాబ్వే బౌలర్లు అకట్టుకుంటున్నారు. చతారా, ముజర్బాని, చిబాబా నిప్పులు చెరిగే బంతులు సంధిస్తున్నారు. వారిని కేఎల్ రాహుల్ (18), రాయుడు (4) అడ్డుకుంటున్నారు. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో ప్రాక్టీస్ గా పనికివస్తుందన్న భావనతో టీమిండియా ఆటగాళ్లు మందకొడిగా ఆడుతున్నారు. దీంతో 11 ఓవర్లు ఆడిన టీమిండియా కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది.

More Telugu News