: మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... ‘ప్రొక్లెయిమ్డ్ అఫెండర్’ గా ప్రకటించాలంటూ ఈడీ పిటిషన్

మొత్తం 17 బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చుట్టూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగుస్తోంది. మనీ ల్యాండరింగ్ ఆరోపణల కింద ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేసిన ఈడీ... కోర్టు ద్వారా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేయించింది. అయినా లండన్ లో కట్టుకున్న విలాసవంతమైన భవంతిలో మాల్యా నిశ్చింతగానే ఉన్నారు. ఈ క్రమంలో నిన్న ఈడీ మరో కీలక అడుగు వేసింది. మాల్యాను ‘ప్రొక్లెయిమ్డ్ అఫెండర్’గా ప్రకటించాలని ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై కోర్టు ఈ నెల 13న విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈడీ అభ్యర్థనకు కోర్టు సానుకూలంగా స్పందిస్తే... మాల్యా అరెస్ట్ కు అవకాశాలు మరింత మెరుగుపడతాయన్న వాదన వినిపిస్తోంది.

More Telugu News