: దేశాధ్యక్షుడిని మట్టుబెట్టేందుకు కుట్ర... మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడికి 15 ఏళ్ల జైలు

ఆయన ఓ దేశానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అధికారం కోల్పోయి మాజీ అయ్యారు. అయితే దేశాధ్యక్షుడి స్థానంలో ఉన్న నేతను మట్టుబెట్టేందుకు కుట్ర పన్నారు. దేశాధ్యక్షుడు ప్రయాణించే స్పీడ్ బోటులో బాంబులు పెట్టి పేల్చేయాలని పథకం పన్నాడు. పథకం బెడిసికొట్టడంతో దోషిగా తేలాడు. 15 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు. నిన్న మాల్దీవుల కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు చెప్పింది. గతంలో మాల్దీవులకు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అహ్మద్ అబీబ్... ప్రస్తుత దేశాద్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యామీన్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. గత సెప్టెంబర్ లో జరిగిన ఈ కుట్రకు సంబంధించిన కేసులో సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు అబీబ్ పై నమోదైన అభియోగాలు నిజమేనని తేల్చింది. దీంతో అబీబ్ తో పాటు ఆయనకు సహకరించిన ఇద్దరు అంగరక్షకులకు కూడా కోర్టు జైలు శిక్ష విధించింది.

More Telugu News