: అమితాబ్ కు అప్పుడు అవకాశమివ్వకపోవడమే మంచిదైంది!: ప్రఖ్యాత రేడియో వ్యాఖ్యాత అమీన్ సయానీ

సినిమాల్లోకి అమితాబ్ బచ్చన్ ప్రవేశించకముందు ఆలిండియా రేడియో (ఏఐఆర్) లో అవకాశాల కోసం ఆయన తిరుగుతున్నప్పుడు 1960ల్లో జరిగిన ఒక సంఘటనను నాటి ప్రముఖ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ గుర్తు చేసుకున్నారు. ఏఐఆర్ లో ప్రెజెంటర్ గా నాడు చాలా బిజీగా ఉండేవాడినని, అలాంటి సమయంలో తనకో అవకాశం ఇవ్వాలంటూ అమితాబ్ బచ్చన్ తమ కార్యాలయానికి వచ్చాడని చెప్పారు. అయితే, అపాయింట్ మెంట్ తీసుకోకుండా అమితాబ్ రావడంతో, ఆయనకు వాయిస్ ఆడిషన్ ఇచ్చే అవకాశం కూడా కల్పించలేదన్నారు. అయినప్పటికీ, పట్టువదలని విక్రమార్కుడిలా అమితాబ్ చాలాసార్లు తమ కార్యాలయం చుట్టూ తిరిగారని... అపాయింట్ మెంట్ లేకపోవడంతో ఆయనకు ఆడిషన్ నిర్వహించలేదని చెప్పారు. అప్పుడు, ఆ పని చేయడం మంచిదైందని, లేకపోతే తన ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చేదని అన్నారు. తాను ఈ విధంగా చేయడం ఒకరకంగా అమితాబ్ కు కూడా మేలే జరిగిందన్నారు. నాడు అమితాబ్ కు అవకాశమిచ్చినట్లయితే ఆయన రేడియో కార్యక్రమాలతోనే బిజీ అయిపోయేవారని... చలన చిత్రరంగం ఒక గొప్ప నటుడిని పొందలేకపోయేదని అమీన్ సయానీ వ్యాఖ్యానించారు.

More Telugu News