విశాఖ వాసులకు ఇక‌ వాట్సప్ లో పోలీసులకు ఫిర్యాదు చేసే అవ‌కాశం

08-06-2016 Wed 12:45
విశాఖ వాసులు ఇక‌పై పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి, కాగితంపై రాసి ఫిర్యాదు చేయవలసిన అవసరం తప్పుతుంది. తాజాగా తీసుకొచ్చిన సౌల‌భ్యంతో ప్ర‌జ‌లు తమ ఫిర్యాదును క్ష‌ణాల్లో వాట్స‌ప్ ద్వారా కూడా పోలీసుల‌కి పంపచ్చు. ప్ర‌జ‌ల‌కు మరింత చేరువ‌గా త‌మ సేవ‌ల‌ను అందించేందుకు వాట్స‌ప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు డీఐజీ శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ఏ స‌మ‌యంలోనైనా వాట్సప్‌ నెంబర్‌- 8142003339కి త‌మ ఫిర్యాదులు పంప‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. విశాఖ పోలీసు సిబ్బందికి సేవలు అందించేందుకు రూపొందించిన యాప్‌ను ప్రారంభిస్తోన్న సంద‌ర్భంగా ఆయ‌న ఈ విష‌యాన్ని మీడియాకు తెలిపారు.