: క్రికెట్ ను పక్కనపెట్టి ఎంత హాయిగా ఉన్నానో..!: విరాట్ కోహ్లీ

వరుస సిరీస్ లతో చాలా కాలంగా తీరికలేకుండా క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, ఈ ఐపీఎల్ సీజను తరువాత దొరికిన ఖాళీ సమయాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపీఎల్ లో 81.03 సరాసరితో 973 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తున నిలిచిన కోహ్లీ "నేనిప్పుడు ఆట నుంచి బయటకు వచ్చి ఆనందిస్తున్నా. కొన్నిసార్లు క్రికెట్ కు దూరంగా ఉంటేనే చాలా బాగుంటుంది. తీరిగ్గా కూర్చుని సేదతీరుతుంటే ఎంతో బాగుంటుంది. నిజాయతీగా చెప్పాలంటే నేనిప్పుడు తదుపరి మ్యాచ్ లు, జట్టు కూర్పు ఇతరత్రాల గురించి ఆలోచించడం కూడా లేదు. ఆ విషయాలన్నీ అక్కడికి వెళ్లాకే" అని కోహ్లీ తెలిపాడు. ప్రీమియర్ ఫుట్సల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కోహ్లీ, ఆ సంస్థ ప్రమోషన్ కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడాడు. క్రికెట్ కు కొంత విరామమిచ్చి ఇతర వ్యాపకాల్లో ఉండటం కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుందని కోహ్లీ చెప్పాడు. త్వరలో కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు జింబాబ్వేలో, ఆపై వెస్టిండీస్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News