: 2025 నాటికి డీజిల్, పెట్రోలు వాహనాలు బ్యాన్ చేసే దిశగా నార్వే

2025 నాటికి పెట్రోల్, డీజిల్‌ తో నడిచే వాహనాలను నిషేధించే దిశగా నార్వే ప్రణాళికలు ప్రారంభించింది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంటులో 2025 నాటికి పెట్రోల్, డీజిల్ వాహనాలను బ్యాన్ చేద్దామంటూ నార్వే ప్రభుత్వం ఓ ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. ఈ ప్రతిపాదనకు నార్వేజియన్ లిబరల్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు మద్దతు పలికారు. నార్వే నిర్ణయాన్ని టెస్లా సిఈఓ ఎలాన్ మస్క్ స్వాగతించారు. రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయం అద్భుతమని అభినందించారు. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్, సోలార్ ఎనర్జీతో నడిచే వాహనాలు రోడ్లపై పరుగులు తీయాలని భావిస్తున్నారు. సంప్రదాయ ఇంధన వనరులతో కాలుష్యాన్ని పారద్రోలాలని వారు నిర్ణయించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే ఎకో ఫ్రెండ్లీ నిర్ణయాలు తీసుకోవడం అవసరమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కాగా, ఈ ప్రక్రియ 2018 నుంచి ప్రారంభం కానుందని వారు వెల్లడించారు.

More Telugu News