: వై-ఫైను అక్రమంగా వినియోగించడం దొంగతనంతో సమానం: ‘సౌదీ’ ఫత్వా

వై-ఫైను అక్రమంగా వినియోగించడం దొంగతనంతో సమానమంటూ సౌదీ అరేబియాలో ఒక ఫత్వా జారీ చేశారు. సౌదీ రాజుకు మతపరమైన అంశాల్లో సలహాలిచ్చే సంఘంలోని సీనియర్ స్కాలర్ అలీ అల్ హకామీ ఈ ఫత్వాను రూపొందించించినట్లు గల్ఫ్ న్యూస్ లో పేర్కొన్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వినియోగదారుల అనుమతి లేకుండా వారి ఇంటర్నెట్ ను వేరే వ్యక్తులు వినియోగించుకోవడం నేరంగా పరిగణిస్తారని పేర్కొంది. పార్కులు, మాల్స్, కెఫెటేరియాలు, హోటళ్లు, ప్రభుత్వ శాఖల వద్ద వై-ఫై ను ఉచితంగా ఉపయోగించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. కానీ, ఇంటర్నెట్ లబ్దిదారుడు లేదా ప్రొవైడర్ అనుమతి తీసుకోకుండా ఆ సేవలను వై-ఫై ద్వారా వినియోగించుకోవాలని చూస్తే మాత్రం నేరంగా పరిగణిస్తామని ఆ ఫత్వా లో పేర్కొన్నారు.

More Telugu News