: కిండర్ 'సర్ ప్రైజ్' చాక్లెట్ లో కెమికల్ డ్రగ్... అవాక్కయిన బాలుడి తండ్రి!

కోడిగుడ్డు ఆకారం ప్యాకింగులో ఆకర్షణీయంగా కనిపించే కిండర్‌ సర్ ప్రైజ్ చాక్లెట్ అంటే ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో ఎంతో క్రేజ్. విశేషం ఏమిటంటే, ఆ చాక్లెట్ లో వుండే రుచి కోసం కాదు, కేవలం అందులో ఉండే చిన్న చిన్న బొమ్మల వంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ కోసమే పిల్లలు వీటిని ఎగబడి మరీ కొంటున్నారు. అందరిలానే సర్ ప్రైజ్ కోసం కిండర్ చాక్లెట్ కొనుగోలు చేసిన ఓ ఐదేళ్ల ఉత్తర ఐర్లాండ్ కుర్రాడికి షాక్ తగిలింది. తన అన్నతో కలిసి ఆడుకుంటూ సర్ ప్రైజ్ అని చాక్లెట్ విప్పి చూసిన బాలుడికి ఒక్కసారిగా అందులో ఊహించని గిఫ్ట్ కనిపించింది. అదేంటో అర్థంకాని బాలుడు తన తండ్రికి చూపించగా, అవాక్కయిన ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సర్ ప్రైజ్ ఎగ్ ని పరిశీలించిన పోలీసులు, అందులో ఉన్నది మెథాంఫెటమీన్ అనే ఒక కెమికల్ డ్రగ్ అని గుర్తించారు. కొన్ని రకాల వ్యాధులలో కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే మందులలో దీనిని వాడతారు. అదృష్టవశాత్తూ బాలుడు దీనిని తినలేదని పోలీసులు అన్నారు.

More Telugu News