: ట్రంప్ ను కొనియాడిన ఉత్తర కొరియా మీడియా, మద్దతు ఇవ్వడానికి సిద్ధం

అమెరికా మీడియాపై మండిపడి విమర్శల పాలవుతున్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఉత్తర కొరియా మీడియా మద్దతు తెలిపింది. ట్రంప్ ఒక తెలివైన రాజకీయ నాయకుడంటూ ఉత్తర కొరియా ప్రభుత్వానికి చెందిన డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఏకంగా ఒక ఎడిటోరియల్ ను ప్రచురించింది. దీంతో పాటు నార్త్ కొరియా న్యూస్ కూడా ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య గొడవలో ట్రంప్ జోక్యం చేసుకోరని చెప్పినట్లు వార్తలను ప్రచురించింది. హిల్లరీ క్లింటన్ నిస్తేజంగా ఉన్నారని విమర్శించిన ఉత్తర కొరియా మీడియా, కొరియా ద్వీపకల్పంలో అణ్వస్త్ర వివాదాలను పరిష్కరించడానికి 'ఇరానియన్ మోడల్' వ్యూహాలను ప్రయోగించవచ్చని ఆమె ఆశిస్తోందని విమర్శించింది. గెస్ట్ కాంట్రిబ్యూటర్, చైనీస్ నార్త్ కొరియా స్కాలర్ హన్ యాంగ్ మూక్ రాసిన ఈ ఎడిటోరియల్ లో , ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే ఉత్తర కొరియా నుంచి తమ సైనిక దళాన్ని వెనక్కి తీసుకుంటారని పేర్కొన్నారు. ట్రంప్ కూడా ఇదివరకే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్ తో మాట్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం, తాజా ఎడిటోరియల్ కు బలాన్నిస్తోంది.

More Telugu News