: చైనా అమ్ములపొదిలో స్టెల్త్ ఫైటర్.. అమెరికాకు హెచ్చరికే!

భవిష్యత్ యుద్ధ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని అప్ గ్రేడ్ చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైపోయింది డ్రాగన్ కంట్రీ. అమెరికా, జపాన్ దేశాల స్టెల్త్ ఫైటర్ లకు దీటుగా జె-20 యుద్ధ విమానాన్ని ఆధునికీకరించామని, ఇది ప్రస్తుతం తుది టెస్టింగ్ దశలో ఉందని చైనా ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఇదిలాఉండగా అమెరికా ఇటీవల రూపొందించిన ఎఫ్-22 యుద్ధవిమానానికి దీటుగా చైనా స్టెల్త్ ఫైటర్ పరీక్షను వేగవంతం చేసిందని అక్కడి విశ్లేషకులు అంటున్నారు. అమెరికా రక్షణ శాఖ సెక్రెటరీ రాబర్ట్ గేట్స్ 2011లో బీజింగ్-ని సందర్శించిన సమయంలోనే జె-20 భవిష్యత్ యుద్ధ విమాన పరీక్షను నిర్వహించిన చైనా, తన దేశ ఎయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటుందని, ఇప్పుడు వీటిపై మరింత ఎక్కువగా దృష్టి సారించిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, భవిష్యత్ తరం యుద్ధ విమానాలతో అమెరికాను సైతం గడగడలాడించడానికి రెడీగా ఉన్నట్లు చైనా మరోసారి సవాలు విసిరింది.

More Telugu News