: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన పాక్ టీనేజి క్రికెటర్

పాకిస్థాన్ లో ఓ టీ-20 క్రికెట్ ఆడుతూ, హషీమ్ అఖ్తర్ అనే ఆటగాడు ఆట విరామ సమయంలో కుప్పకూలగా, అతని మెదడులో రక్తం గడ్డకట్టిందని తేలడంతో మిగతా ఆటగాళ్లు విషాదంలో మునిగిపోయారు. అస్లీ బ్రిడ్జ్ సీసీ తరఫున ఆడుతున్న హషీమ్, బ్రాడ్షా సీసీ జట్టుపై ఆడుతున్న వేళ ఈ ఘటన జరిగింది. బ్రేక్ తరువాత గ్రౌండ్ లోకి వెళ్లే సమయంలో హషీమ్ కనిపించకపోవడంతో, అతని కోసం వెతకగా, ఓ వాష్ రూమ్ లో అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, మెదడులో రక్తం గడ్డ కట్టిందని చెప్పి, బలవంతంగా కోమాలోకి పంపిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఇప్పటికీ అతడి పరిస్థితి విషమంగానే ఉందని, ప్రాణాలు కాపాడే విషయమై ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా, హషీమ్ మైగ్రేన్ తో బాధపడేవాడని, తన 13 ఏళ్ల వయసు నుంచి ఆల్ రౌండర్ గా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, జాతీయ జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తున్నాడని, అతని స్నేహితులు తెలిపారు.

More Telugu News