: స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా మహిళలే వినియోగిస్తున్నారట!

స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగిస్తూ, వాటిపై మోజు పెంచుకున్న వారిలో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉన్నారట. దక్షిణ కొరియాలోని అజౌ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అంశానికి సంబంధించి ప్రొఫెసర్ చాంగ్ జే-యిమోన్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలోని ఆరు కళాశాలలకు చెందిన 1,236 మంది విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వినియోగంపై సర్వే నిర్వహించారు. రోజుకు నాలుగు గంటల పాటు స్మార్ట్ ఫోన్ ను వినియోగించే వారిలో 52 శాతం మహిళలు ఉండగా, 29.4 శాతం పురుషులు ఉన్నారు. రోజుకు ఆరు గంటల పాటు వినియోగించే వారిలో... మహిళలు 23 శాతం, పురుషులు 11 శాతంగా వున్నారు. అదేపనిగా స్మార్ట్ ఫోన్ వాడటం తమకు అలవాటని 37 శాతం మహిళలు చెప్పారు. స్మార్ట్ ఫోన్ వాడకపోతే ఇన్ సెక్యూర్ గా ఉంటుందని 20 శాతం మహిళలు, 8.9 శాతం పురుషులు పేర్కొన్నారు. అయితే, సామాజిక మాధ్యమాలను వినియోగించేందుకే స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు అధికశాతం మహిళలు చెప్పడం గమనార్హం.

More Telugu News