: ఒరాకిల్ పై కోర్టు కేసులో గెలిచిన గూగుల్

సుదీర్ఘ కాలంగా అమెరికా కోర్టులో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ కు సంబంధించి గూగుల్, ఒరాకిల్ మధ్య జరుగుతున్న పోరులో గూగుల్ గెలిచింది. గూగుల్ కు సంబంధించిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించేందుకు కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తమకు సంబంధించిన జావాకోడ్ ను గూగుల్ వినియోగించుకుందని ఒరాకిల్ 2010లో కేసు పెట్టింది. దీనికి పరిహారంగా 9 బిలియన్ డాలర్లు తమకు చెల్లించాలని ఒరాకిల్ డిమాండ్ చేసింది. దీనిని సుదీర్ఘ కాలం విచారించిన అమెరికా న్యాయస్థానం గూగుల్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

More Telugu News