: పదునైన బంతులతో నిప్పులు చెరిగింది వీరే

ఐపీఎల్ సీజన్ 9లో బ్యాట్స్ మన్ షోను పది మంది బౌలర్లు అద్భుతమైన రీతిలో అడ్డుకున్నారు. పదునైన యార్కర్ లు, ఇన్ కట్టర్ లు, స్వింగర్లు, గుడ్ లెంగ్త్, గూగ్లీలు, దూస్రాలు, గింగిర్లు తిరిగే బంతులతో అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఓ వైపు బ్యాట్స్ మన్ బౌండరీలతో విరుచుకుపడుతుంటే వారి దూకుడుకు అడ్డుకట్టవేస్తూ, వారి సామర్థ్యాన్ని పరీక్షిస్తూ బౌలర్లు ఆటలాడుకున్నారు. కొంత మంది బ్యాట్స్ మన్ దూకుడుతో గణాంకాల్లో భారీ వ్యత్యాసాలు కనిపించినా వికెట్ల వేటలో అద్భుతంగా దూసుకొచ్చారు. క్రికెట్ కేవలం బ్యాట్స్ మన్ గేమ్ మాత్రమే కాదని, రేసులో తమ ప్రతిభ కూడా ఉంటుందని నిరూపించారు. టాప్ బౌలర్లకు టోర్నీ మొత్తం ఆడే అవకాశం దొరకగా, కొంత మంది బౌలర్లకు కొన్ని మ్యాచుల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. దీంతో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తాచాటారు. ఐపీఎల్ సీజన్ 9లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు ఆడిన భువనేశ్వర్ కుమార్ 15 మ్యాచులాడి 21 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలవగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కేవలం 12 మ్యాచులాడిన యజువేంద్ర చాహల్ 20 వికెట్లు తీసి జింబాబ్వే పర్యటన భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అతని తరువాతి స్థానంలో అదే జట్టుకి చెందిన షేన్ వాట్సన్ 20 వికెట్లతో నిలిచాడు. తరువాతి స్థానంలో గుజరాత్ లయన్స్ ఆటగాడు ధావల్ కులకర్ణి 18 వికెట్లతో నిలిచాడు. ఐదవ స్ధానం నుంచి వరుసగా, మిచెల్ మెక్ క్లెంగన్ (17), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (16), ఆండ్రీ రస్సెల్ (15), సందీప్ శర్మ (15), జస్ ప్రీత్ బుమ్రా (15), డ్వెన్ బ్రావో (15) లు నిలిచారు. కీలక సమయాల్లో వికెట్లు తీసిన వీరంతా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం విశేషం.

More Telugu News