: కారులో చిక్కుకున్న రాణి తేనెటీగ... కాపాడేందుకు 24 గంటలు వెంబడించిన మగ తేనెటీగలు!

ఇదొక అద్భుత ఘటన. తమ గ్రూప్ లోని రాణి తేనెటీగ ఓ కారులో ఇరుక్కున్న వేళ, దాన్ని కాపాడేందుకు 24 గంటల పాటు కారును వెంబడించాయి తేనెటీగలు. బ్రిటన్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. మరిన్ని వివరాల్లోకి వెళితే, కార్లోజ్ హవార్త్ అనే 65 ఏళ్ల ముసలామె, ఓ నేచర్ రిజర్వ్ పార్కుకు వెళ్లి, అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో హావెర్ ఫోర్డ్ వెస్ట్ టౌన్ సెంటర్ వద్దకు రాగానే, 20 వేలకు పైగా తేనెటీగలు కారుకు అతుక్కున్నాయి. కారు బయలుదేరినా అవి వదల్లేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె, అధికారులకు సమాచారం ఇస్తే, ముగ్గురు తేనెటీగల సంరక్షకులు, జాతీయ పార్క్ రేంజర్ వచ్చి అసలు సంగతి కనుక్కున్నారు. ఆమె తీసుకువెళుతున్న ఓ అట్టపెట్టెలో రాణి తేనెటీగ ఉండవచ్చని, దాన్ని కాపాడుకునేందుకే అవి వెంబడిస్తూ వచ్చాయని తెలిపి, ఆ పెట్టెను ఓపెన్ చేశారు. ఆపై రాణి తేనెటీగ ఎగిరిపోగా, వెంబడిస్తూ వచ్చిన వేలాది మగ తేనెటీగలు కూడా మాయమయ్యాయట. ఈ తరహా ఘటన తన జీవితంలో ఎన్నడూ చూడలేదని కార్లోజ్ 'టెలిగ్రాఫ్' పత్రికకు తెలిపింది.

More Telugu News