: పిల్లల ఫోటోలు పెట్టి అనవసర ఒత్తిడికి గురవుతున్న తల్లులు: యూఎస్ అధ్యయనం

తమ చిన్నారుల ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న తల్లులు అనవసర ఒత్తిడికి లోనవుతున్నారని యూఎస్ వర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పిల్లల ఫోటోలు పెడుతున్న అమ్మలు, వాటికి వచ్చిన కామెంట్లు, లైక్ లపై అమితాసక్తిని పెంచుకుని, పాజిటివ్ రెస్పాన్స్ రాకుంటే ఆందోళనకు గురవుతున్నారని ఓహియో స్టేట్ వర్శిటీ ప్రొఫెసర్లు తమ అధ్యయనంలో తేల్చారు. ఇతర తల్లులకన్నా, తాము తమ పిల్లల్ని మంచిగా పెంచుతున్నామన్న భావన, నలుగురి మన్నన పొందాలన్న ఉద్దేశం వారిలో పెరుగుతోందని, ఇది ప్రమాదకరమని అధ్యయనం పేర్కొంది. భావోద్వేగాలతో కూడిన ట్యాగ్ లైన్లు పెట్టడం కూడా తగదని, పిల్లల పోస్టులు పెట్టి, ఆపై ఒత్తిడికి లోనయ్యేకన్నా, వాటిని పోస్ట్ చేయకుండా ఉంటేనే మంచిదని సలహా ఇస్తున్నారు.

More Telugu News