: టీమిండియా క్రికెటర్ నెహ్రా మోకాలుకి సర్జరీ

ఐపీఎల్ మ్యాచ్ లో ఇటీవల గాయపడ్డ హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఆటగాడు ఆషిస్ నెహ్రా కుడి మోకాలికి మరి కొద్దిసేపట్లో శస్త్ర చికిత్స జరగనుంది. బీసీసీఐ తెలిపిన వివరాల ప్రకారం, లండన్ కు చెందిన ఆర్థోపెడిక్ స్పెషలిస్టు డాక్టరు విలియమ్స్ ఈ శస్త్రచికిత్స చేయనున్నారు. ఆపరేషన్ తర్వాత కొన్నిరోజులు నెహ్రా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. కాగా, ఈ నెల 15న మొహాలిలో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుపై ఆడుతుండగా నెహ్రా కుడి మోకాలికి గాయమైంది. నెహ్రాను పరిశీలించిన వైద్యుడు విలియమ్స్ శస్త్ర చికిత్స అవసరమని చెప్పిన విషయం తెలిసిందే. ఆపరేషన్ తర్వాత మరికొన్ని మ్యాచ్ లకు నెహ్రా దూరం కానున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు రేపు తలపడనుంది. ఈ మ్యాచ్ కు నెహ్రా దూరం కానుండటంతో జట్టుపై ఎటువంటి ప్రభావం పడుతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

More Telugu News