: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబయిలో ఈరోజు బీసీసీఐ బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. బీసీసీఐ అధ్యక్ష పదవికి ఠాకూర్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సమక్షంలో ఆయన నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో ఠాకూర్ స్థానంలో మహారాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడైన షిర్కే బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాగా, బీసీసీఐ బోర్డు అధ్యక్షుడిని ప్రతిపాదించే అధికారం ఈస్ట్ జోన్ దే. ఆ జోన్ లో ఒక సంఘం ప్రతిపాదించినా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చు. ఠాకూర్ కు ఈస్ట్ జోన్ లోని ఆరు సంఘాలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశాయి.

More Telugu News