: సెలెక్టర్లపై మళ్లీ యుద్ధం ప్రకటించిన విండీస్ స్టార్ క్రికెటర్లు

వెస్టిండీస్ సెలెక్టర్లపై మరోసారి క్రిస్ గేల్, డ్వెన్ బ్రావో, డారెన్ సమీలు యుద్ధం ప్రకటించారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు ముందు రేగిన కాంట్రాక్టుల వివాదం ఇంకా ముగియలేదు. వచ్చేనెల స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరగనున్న ముక్కోణపు టోర్నీలో పాల్గొనే వెస్టిండీస్ జట్టును సెలెక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ ఆటగాళ్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, డారెన్ సామీలకు సెలెక్టర్లు మొండిచెయ్యి చూపించారు. దీంతో, కీరోన్ పొలార్డ్, సునీల్ నరైన్ ను ఏ ప్రాతిపదికన జట్టులోకి ఎంపిక చేశారో చెప్పాలని గేల్, బ్రావో, సమీ డిమాండ్ చేశారు. బ్రావో దీనిని 'జోక్ ఆఫ్ ది డే'గా వ్యాఖ్యానించాడు. గత కొంతకాలంగా పొలార్డ్, నరైన్ లు అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నారని, వారిని ఎంపిక చేయడం మ్యాజిక్ లా అనిపిస్తోందని బ్రావో పేర్కొన్నాడు. 'లేదు, ఐపీఎల్ ప్రతిభను ఆధారంగా చేసుకుని ఈ ఎంపిక జరిగిందని అనుకుందామంటే...అసలు ఐపీఎల్ లో ఎవరు బాగా ఆడుతున్నార'ని ప్రశ్నించాడు. కీరన్ పొలార్డ్ 55 (జెర్సీ నంబర్) తో పాటు, నరైన్ ను వన్డేలకు ఏ ప్రాతి పదికన ఎంపిక చేశారో చెప్పాలని గేల్ సెలెక్టర్లను నిలదీయగా, 2014 నుంచి జాతీయ జట్టుకు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించని పొలార్డ్ ను జట్టులోకి ఎలా తీసుకున్నారని సామీ ప్రశ్నించాడు.

More Telugu News